Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గవర్నర్ తమిళిసై
- రాజ్ భవన్లో ఘనంగా బోనాల ఉత్సవాలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మహంకాళి అమ్మవారి ఆశీర్వాదాలతో కోవిడ్-19ను పెద్ద ఎత్తున కట్టడి చేయగలిగామని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర రాజన్ తెలిపారు. శనివారం హైదరాబాద్‌లోని రాజ్‌భవన్ దేవాలయంలో నిర్వహించిన ఆషాడం బోనాల ఉత్సవాల్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమిళిసై మాట్లాడుతూ కోవిడ్ నుంచి బయటపడి ప్రజలంతా సాధారణ జీవితాలను తిరిగి ప్రారంభించారనీ, నిర్భయగా దేవాలయాలకు వచ్చి బోనాల ఉత్సవాల్లో పాల్గొంటున్నారని చెప్పారు. దేశం, తెలంగాణ కోసం తాను ప్రార్థించినట్టు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ కార్యదర్శి కె.సురేంద్ర మోహన్, ఉన్నతాధికారులు, సిబ్బంది, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.