Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంపిక జాబితా విడుదల : రోనాల్డ్ రోస్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
2022-23 విద్యా సంవత్సరానికి గాను వీటీజీ సెట్ సాంఘిక గిరిజన, బీసీ ,జనరల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ విద్యా సంస్థల్లో ఐదో తరగతిలో ప్రవేవానికి ఎంపికను శనివారం టీఎస్‌డబ్ల్యుఆర్‌ఈఐఎస్ కార్యదర్శి రోనాల్డ్ రోస్ విడుదల చేశారు. ఎంపికైన అభ్యర్థులు వారి సంబంధిత సంస్థలకు నివేదించాలని కోరారు. అడ్మిషన్ ఫార్మాలిటీని పూర్తి చేయటానికి శనివారం నుంచి ఈ నెల 29వరకు టీసీ, కులం, ఆదాయం, మార్కుల మెమో, బోనఫైడ్ తదితర ధృవ పత్రాలతో రావాలని తెలిపారు. అడ్మిషన్ సమయంలో టోల్‌ఫ్రీ నెంబర్ 1800 425 45678 సేవలను కూడా ఉపయోగించుకోవచ్చని ఆయన తెలిపారు.