Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎంకు కేంద్రమంత్రి కిషన్రెడ్డి లేఖ
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
రామగుండంలో కేంద్ర ప్రభుత్వం నిర్మించదలచిన వంద పడకల ఈఎస్ఐ ఆస్పత్రి నిర్మాణానికి అవసరమైన భూమిని కేటాయించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావును కోరుతూ కేంద్రమంత్రి జీ కిషన్రెడ్డి లేఖ రాసారు. కార్మికులకు అవసరమైన వైద్య సేవలను మరింత సులభంగా అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ ఆస్పత్రి భవనాన్ని నిర్మించనుందని ఆ లేఖలో పేర్కొన్నారు.
దీనిపై గతంలో కూడా లేఖరాసినట్టు వివరించారు. ఆస్పత్రి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం చూపించిన భూమి ఏమాత్రం అక్కరకు రాదనీ, మరో ప్రాంతంలో ఇవ్వాలని కోరారు. దీనికి సంబంధించిన నిపుణుల కమిటీ నివేదికను కూడా సీఎంకు పంపుతున్నట్టు ఆ లేఖలో తెలిపారు.