Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ ఉత్తర్వులు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పరిపాలనలో సంస్కరణలు తీసుకొచ్చి మెరుగైన పాలన దిశగా ఇప్పటికే కొత్త జిల్లాలు,రెవెన్యూ డివిజన్లు, మండలాలు ఏర్పాటు చేసిన ప్రభుత్వం తాజాగా మరో 13 మండలాలను ప్రకటించింది. ఆయా ప్రాంతాల ప్రజల వినతుల మేరకు అధ్యయనం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ నూతన మండలాల ఏర్పాటుకు అంగీకరించారు. ఆయన ఆదేశాల మేరకు 9 జిల్లాల్లో కొత్తగా 13 మండలాలను ఏర్పాటుచేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. కొత్త మండలాల ఏర్పాటుకు సంబంధించి గెజిట్ నోటిపికే షన్ ప్రచురించాలని ఆయా జిల్లా కలెక్టర్లను సీఎస్ ఆదేశించారు.
జిల్లా కొత్త మండలాలు
జగిత్యాల - ఎండపల్లి, భీమారం
మహబూబాబాద్ - సీరోల్
నారాయణ పేట - గుండుమల్ , కొత్తపల్లె
వికారాబాద్ - దుడ్యాల్
మహబూబ్ నగర్ - కౌకుంట్ల
నిజామాబాద్ - ఆలూర్, సాలూర,డొంకేశ్వర్
నల్లగొండ - గట్టుప్పల్
సంగారెడ్డి - నిజాం పేట్
కామారెడ్డి - డోంగ్లి