Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈనెల 25 నుంచి అన్ని రకాల విధులకు దూరం
- వీఆర్వోల రాష్ట్ర జేఏసీ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
హొదా మరియు జాబుచాటులేని విధులు మాకొద్దని వీఆర్వోల జేఏసీ ప్రకటించింది. ఈనెల 25 నుంచి అనధికారిక అన్ని రకాల విధులకు దూరంగా ఉంటాయని పేర్కొంది. ఇదే విషయాన్ని తెలియజేస్తూ...శనివారం హైదరాబాద్నాంపల్లిలోని సీసీఎల్ఏ వినతిపత్రం సమర్పించింది. సర్వీస్ రూల్స్ మరియు ఎలాంటి హోదాలేని వీఆర్వోలను అనధికారికంగా ఒత్తిడికి గురిచేసి విధులను తీసుకుంటున్నారని జేఏసీ చైర్మన్ గోల్కొండ సతీష్, అడిషనల్ సెక్రటరీ జనరల్ పల్లేపాటి నరేష్, వైస్ చైర్మన్ చింతలమురళి, ప్రతిభ, ఆర్గనైజింగ్ సెక్రెటరీలు కృష్ణగౌడ్, శ్రావణ్, శ్రీనివాస్‌రెడ్డి, కృష్ణమేరీ పేర్కొన్నారు. 23 నెలల నుంచి ఉన్నత అధికారులతోపాటు సమస్య పట్ల స్పందించడం లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వీఆర్వోలకు అపాయిట్మెంట్ ఇవ్వకపోవడం రాజ్యాంగాన్ని కించపరిచినట్టుగా భావిస్తున్నట్టు ప్రకటించారు.