Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బాధితులకు సహాయం చేయండి
- మంత్రి కేటీఆర్ పిలుపు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలున్న నేపథ్యంలో ఆదివారం తన జన్మదిన వేడుకలకు దూరంగా ఉంటున్నట్లు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు తెలిపారు. వర్షాలతో పలు జిల్లాల్లో ప్రజలు ఇబ్బంది పడుతున్న నేపథ్య ంలో టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు తమకు తోచిన మేరకు ''గిఫ్ట్ ఏ స్మైల్'' కార్యక్రమం కింద ప్రజలకు సహాయం చేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. పార్టీ ప్రజా ప్రతి నిధులు,నాయకులు జన్మదిన సంబరా లకు బదులు స్థానికంగా ఉన్న ప్రజలకు సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
కేటీఆర్ కాలికి స్వల్ప గాయం
శనివారం ప్రగతి భవన్లో కింద పడిన నేపథ్యంలో కేటీఆర్ కాలికి స్వల్ప గాయమైంది. యాంకిల్ లిగ్మెంట్ లో కాలు చీలిక ఏర్పడింది. ఆస్పత్రిలో చికి త్స తర్వాత ఆయన తిరిగి ప్రగతిభవన్ కు వెళ్లారు. కేటీఆర్ కాలి గాయం పట్ల ఆందోళన అవసరం లేదన్న వైద్యులు మూడు వారాలపాటు విశ్రాంతి తీసుకో వాలని సూచించారు.
హెల్పింగ్ హార్ట్ పాట విడుదల...
కేటీఆర్ అభిమాని ఉగ్గం రాకేష్ యాదవ్ ఆధ్వర్యంలో మాట్ల తిరుపతి సం గీత దర్శకత్వంలో కేటీఆర్‌పై రూపొందిం చిన హెల్పింగ్ హార్ట్ ప్రత్యేక పాటను ప్రముఖ సనీ దర్శకులు ఎన్.శంకర్ శనివారం విడుదల చేశారు. కేటీఆర్ చేసిన సేవలపై పాటను రూపొందించినందుకు శంకర్ వారిని అభి నందించారు.మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.
సీఎంకు ధన్యవాదాలు.... ఎమ్మెల్సీ కవిత
పరిపాలనా సంస్కరణల్లో భాగంగా, ప్రజల ఆకాంక్షల మేరకు జగిత్యాల, కోరుట్ల, ఆర్మూరు, బోధన్ నియోజక వర్గాల్లో ఐదు నూతన మండలాలు ఏర్పాటు చేసినందుకు సీఎం కేసీఆర్‌కు ఎమ్మెల్సీ కవిత ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలిపారు.