Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గోలి శ్రీనివాస్ రెడ్డి
నవతెలంగాణ - వెల్దండ
వెల్దండ మండల కేంద్రాని కి చెందిన జంగిలి శ్రీకాంత్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గోలి శ్రీనివాస్ రెడ్డి శనివారం మృతుని కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుని కుటుంబ సభ్యు లకు రూ. 10 వేల ఆర్థిక సహాయం అందజేసారు. మృతుని కుటుంబా నికి అండగా ఉంటానని అన్నారు. టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు, సర్పంచ్ యెన్నం భూపతి రెడ్డి, ఎంపీటీసీ జ్యోతి నిరంజన్, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు రూపం వెంకట్ రెడ్డి, తల కొండ పల్లి టిఆర్ఎస్ పార్టీ మండల వర్కింగ్ ప్రసిడెంట్ చంద్రశేఖర్ రెడ్డి ,టీఆర్ఎస్ నాయకులు జంగయ్య ప్రసాద్ జంగిలి ,ఆనంద్ వున్నారు.