Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
హైదరాబాద్ కాచిగూడకు చెందిన సంగీత హీరేకర్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పొందారు. సంగీత ఎడ్యుకేషన్ విభాగంలో సాక్షర భారత్ మిషన్ విత్ పర్టిక్యులర్ రిఫరెన్స్ టు ఎంపవర్ మెంట్ ఆఫ్ విమెన్ అనే అంశంపై ప్రొఫెసర్ పడాల ప్రసాద్ పర్యవేక్షణలో పీహెచ్డీ పూర్తి చేశారు. పీహెచ్‌డీలో భాగంగా యూజీసీ రీసెర్చ్ ఫెలోషిప్ కూడా పొందారు. సంగీత హీరేకర్ ఇప్పటి వరకు 10 పరిశోధన ప్రతులను వివిధ కాన్ఫరెన్స్‌లలో ప్రజెంటేషన్ చేశారు. మూడు పరిశోధనా ప్రతులను అంతర్జాతీయ జర్నల్స్‌లో ప్రచురించారు. ఈ సందర్భంగా తన భర్త గోవింద్ రావు హీరేకర్ సహకారం, దేవుని ఆశీస్సులతో పీహెచ్డీ పొందగలిగానని పేర్కొన్నారు.