Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 20 మందికి అస్వస్థత
- కల్తీ ఆహారమే కారణం
నవతెలంగాణ-మొయినాబాద్
రంగారెడ్డి జిల్లా మొయినా బాద్ మండలంలోని ఎన్టీఆర్ రెసిడెన్షియల్ పాఠశాలలో శనివారం విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయింది. 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరోచనాలతో బాధపడుతున్నారు. విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం..
శుక్రవారం రాత్రి విద్యార్థులు ఆహారం ఎగ్ బజ్జీ తిని పడుకున్నారు. రాత్రి సమయంలో విద్యార్థులు వాంతులు, విరేచనాలు చేసుకున్నారు. ఈ విషయాన్ని వార్డెన్‌కు తెలిపారు. శనివారం ఉదయం ఆరుగురికి ఆరోగ్యం కుదుట పడింది. కానీ, మరో 14 మంది వాంతులు, విరేచనాలు చేసుకున్నారు. వీరిని వెంటనే సమీపంలోని భాస్కర జనరల్ ఆస్పత్రికి తరలించారు. సిరప్స్, ఇంజెక్షన్స్ ద్వారా ఫ్లూయిడ్స్ ఎక్కించి చికిత్స అందజేసినట్టు పాఠశాల యాజమాన్యం తెలిపింది. ముగ్గురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిని ఆస్పత్రిలోనే ఉంచాలని వైద్యులు సూచించినప్పటికీ హాస్టల్‌కు తీసుకెళ్లారు. అక్కడికి వెళ్లాక విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. తల్లితండ్రులు వచ్చి పిల్లలను తీసుకెళ్లారని, ఎవరికీ ఏ ఆపాయం లేదని హాస్టల్ సిబ్బంది తెలిపారు.