Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు
నవతెలంగాణ-రాజేంద్రనగర్
యువత వ్యవసాయం వైపు దృష్టి సారించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు చెప్పారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో శనివారం ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, ట్రాక్టర్స్ అండ్ ఫార్మ్ ఎక్విప్మెంట్ లిమిటెడ్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన 'జె ఫార్మ్ అండ్ ప్రొడక్ట్ ట్రైనింగ్ సెంటర్'ను యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ ప్రవీణ్‌రావుతో కలిసి రఘునందన్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వ్యవసాయ రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, యువత వ్యవసాయం వైపు వెళ్లేందుకు ఆలోచించాలని అన్నారు. నలభై ఏండ్లుగా వ్యవసాయరంగ అభివృద్ధికి ప్రవీణ్‌రావు అసమాన సేవలు అందించారని అభినందించారు. ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తూ వర్సిటీని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ప్రెసిషన్ ఫార్మింగ్, డేటా టెక్నాలజీలతో కూడిన వ్యవసాయ పద్ధతుల్ని ప్రోత్సహించాలన్నారు. ఎనిమిదేండ్లుగా ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు, వర్సిటీ సిబ్బంది పూర్తిస్థాయిలో సహకరించడం వల్లే అగ్రికల్చర్ యూనివర్సిటీని అంతర్జాతీయ సంస్థల సరసన నిలబెట్టినట్టు వివరించారు. పూర్తి సంతృప్తితో తన పదవీ కాలం ముగిసిందన్నారు. ఈ కార్యక్రమంలో మల్లికా శ్రీనివాసన్, సుధీర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.