Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎనిమిదేండ్లుగా రూ.5కే మెరుగైన ఆహారం
- సాధారణ కూలి నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ వరకు ఆసరా
- 9,67,53,612 మందికి భోజనం
- రూ.185 కోట్ల 89లక్షల ఖర్చు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్లో సుమారు కోటి జనాభా నివసిస్తున్నది. ఆర్థికస్థితి, నైపుణ్యంతో నిమిత్తం లేకుండా అన్ని వర్గాల ప్రజలను మహానగరం అక్కున చేర్చుకుంటున్నది. దేశంలోలోనే హైదరాబాద్ నగరం విద్యా, నైపుణ్య శిక్షణ, ఉపాధికి గమ్యస్థానంగా మారింది. నగరానికి వచ్చిన ప్రతి ఒక్కరి బతుకుకు భరోసా కల్పిస్తున్నది. నగరంలో రోజువారీగా వివిధ వృత్తులపై మనుగడ సాగిస్తున్న వేలాదిమంది పేదలు, నైపుణ్యాభివృద్ధితో కూడిన ఉపాధికి శిక్షణ పొందుతూ యువత పోటీ పడుతున్నది. ఈ నేపథ్యంలో అటు పేదలు, ఇటు ఉద్యోగార్థుల ఆకలిని తీర్చేందుకు అన్నపూర్ణ భోజన పధకాన్ని తెలంగాణ ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తున్నది. లబ్ధిదారులు నుంచి కేవలం రూ.5లకే 400 గ్రాముల అన్నాన్ని, 120 గ్రాముల సాంబారు, 100 గ్రాముల పప్పుతో పాటు 15 గ్రాముల పచ్చడితో నాణ్యమైన పోషక విలువలున్న భోజనాన్ని అన్నపూర్ణ పధకం కింద సర్కారు అందజేస్తున్నది. 2014 లో జీహెచ్ఎంసీ ప్రవేశపెట్టిన అన్నపూర్ణ భోజనం పధకాన్ని ప్రభుత్వం రెగ్యులర్గా పర్యవేక్షణ చేస్తూ పటిష్టంగా అమలు చేస్తున్నది.
ఆకలికి ఆలంబనగా..
ఐదు రూపాయలకే అన్నపూర్ణ భోజనంతో పేదలు, విద్యార్థులు, ఉద్యోగార్థుల ఆకలి తీరుతున్నది. 2014 నుంచి 2022 మే నెలాఖరు వరకు 9,67,53,612 మంది అన్నపూర్ణ భోజనం చేశారు. రూ.5లకే అన్నపూర్ణ భోజనానికి రూ.185 కోట్ల 89 లక్షలు ఖర్చు చేశారు. కోవిడ్ విపత్తుకు ముందు 150 కేంద్రాల ద్వారా రోజుకు 45 వేల అన్నపూర్ణ భోజనాలను అందిస్తున్నది. మొదటి విడత కోవిడ్ లాక్ డౌన్ సమయంలో హైదరాబాద్ నగరంలో మధ్యాహ్నం పూట మొత్తం 373 రెగ్యులర్, మొబైల్ కేంద్రాల ద్వారా ఉచితంగా అన్నపూర్ణ భోజనం పెడుతోంది. రాత్రి పూట మొత్తం 259 రెగ్యులర్, మొబైల్ కేంద్రాలు ద్వారా రాత్రి పూట భోజనం పెడుతున్నది. ప్రపంచాన్ని గడ గడ లాడించిన కోవిడ్ లాంటి విపత్తులో నిరుపేదల ఆకలి బాధను తీర్చేందుకు అన్నపూర్ణ పధకం అక్షయపాత్రగా మారింది. 2020-21లో మొత్తం 2,29,46,080 భోజనాలను అన్నార్థుల ఆకలిని ఈ పథకం తీర్చింది లబ్ధిదారులు సౌకర్యంగా భోజనం చేయుటకు అన్నపూర్ణ కేంద్రాలకు సీటింగ్ సదుపాయం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా మొదటగా నగరంలో లిసీటింగ్ అన్నపూర్ణ కాంటీన్లలిఏర్పాటుకు 32 ఏరియాలను గుర్తించి సదుపాయాలు కల్పిస్తున్నారు.
2014 నుంచి ఇప్పటివరకు...
సం అన్నపూర్ణ లబ్దిదారుల సంఖ్య.......వ్యయం
2014-15 9,12,685 రూ.2.21 కోట్లు.
2015-16 27,12,046 రూ.6.58 కోట్లు.
2016-17 38,49,620 రూ.9.34 కోట్లు.
2017-18 95,59,676 రూ.23.18 కోట్లు
2018-19 1,03,06,590 రూ.24.99 కోట్లు
2019-20 89,63,665 రూ.21.74 కోట్లు
2020-21 2,29,46,080 రూ.55.64 కోట్లు
(పూర్తిగా ఉచితం, రూ 5/- లు కూడా తీసుకోలేదు)
2021-22 3,66,87,830 రూ.38.08 కోట్లు
2022-23 లో ఏప్రిల్,మే నెలలో లబ్ధిదారులు సంఖ్య 15,86,200 మంది. వ్యయం రూ.4.13 కోట్లు