Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ విశిష్ట సంస్కృతి, విభిన్న జీవనం, ప్రకృతి, పర్యావరణానికి బోనాల పండుగ ప్రతిబింబం అని కొనియాడారు. రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందాలనీ, ప్రజలందరూ సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. మహంకాళి దేవి ఆశీర్వాదంతో కోవిడ్-19 దాదాపు నియంత్రించబడిందనీ, ప్రజలు సాధారణ జీవితాలకు తిరిగి వచ్చారని పేర్కొన్నారు.