Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఘనంగా లాల్ దర్వాజ బోనాలు
- పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రులు
నవతెలంగాణ-సిటీబ్యూరో/ధూల్‌పేట్
మహానగరం బోనమెత్తింది. అదివారం నగరవ్యాప్తంగా ఆషాడ మాసం లాల్ దర్వాజా బోనాలు అంగరంగ వైభవంగా జరిగాయి.. మహిళలు వేలాదిగా వచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించారు. దాంతో ఆ ప్రాంతమంతా జన సందోహంగా మారింది. పోతురాజుల విన్యాసాలు, తొట్టెల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ చైర్మెన్ రాకేష్ తివారి ఆధ్వర్యంలో లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమ్మద్ అలీ పట్టు వస్త్రాలు సమర్పించారు.
సందర్శించుకున్న ప్రముఖులు..
బోనాల ఉత్సవాలకు పెద్ద సంఖ్యలో ప్రముఖులు రావడంతో పాతబస్తీ సందడిగా మారింది. ప్రధాన ఆలయాలను సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు. కేంద్ర పర్యాటకశాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి, నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, మాజీ మంత్రి జె. గీతారెడ్డి, సి.కృష్ణాయాదవ్, రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్, ఎంపీ ధర్మపురి అరవింద్, ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రాజా సింగ్, దానం నాగేందర్, ఎమ్మెల్సీలు కల్వకుంట్ల కవిత, డాక్టర్ బండ ప్రకాష్ ముదిరాజ్, వైఎస్ఆర్టీపీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల, బీజేపీ నాయకురాలు విజయశాంతి, ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పి.వి. సింధు, నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల ఉన్నతాధికారులు, పలువురు పాల్గొన్నారు.