Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు నంద్యాల నర్సింహారెడ్డి
నవతెలంగాణ-సంస్థాన్‌నారాయణపురం
అమరుల త్యాగం పార్టీ ఎప్పటికి మరువదనీ సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు నంద్యాల నరసింహారెడ్డి అన్నారు. ఆదివారం యాదాద్రిభువనగిరి జిల్లా సంస్థాన్‌నారాయణపురం మండలం పుట్టపాక గ్రామంలో నిర్వహించిన సీపీఐ(ఎం) నాయకులు మర్రి నర్సిరెడ్డి, సుక్క అబ్బయ్య, నడికుడి శంకరయ్య, నడికుడి బచ్చయ్యల 23వ వర్ధంతి సభలో ఆయన మాట్లాడారు. ఈ ప్రాంతంలో సీపీఐ(ఎం)ను రాజకీయంగా ఎదుర్కొనే సత్తాలేని అరాచక ముఠా హత్యలకు పాల్పడిందన్నారు. హత్యలతో ప్రజాఉద్యమాలను ఆపలేరని హెచ్చరించారు. హత్యలకు పాల్పడ్డ అరాచక ముఠా నేడు కనుమరుగైందే తప్ప ప్రజానాయకులను కోల్పోయిన తమ పార్టీ మరింత ఆత్మధైర్యంతో ప్రజా ఉద్యమాలను నిర్వహిస్తుందన్నారు. అమరుల ఆశయాలు కొనసాగించాలని కోరారు. పాలకులు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఉద్యమాల ద్వారానే అడ్డుకోవాలన్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మత విధ్వేషాలను రెచ్చగొట్టి మైనార్టీ ప్రజలపై దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతందని విమర్శించారు. మోడీ పాలనలో దేశ సార్వభౌమత్వం, లౌకికభావం దెబ్బతింటుందన్నారు. రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. కేసీఆర్ ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమయ్యారన్నారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి ఎమ్డీ జహంగీర్, కార్యదర్శి వర్గసభ్యులు దోనూరి నర్సిరెడ్డి, మాటూరి బాలరాజు, మండల కార్యదర్శి దోడ యాదిరెడ్డి, డీవైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆనగంటి వెంకటేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వనం శేఖర్, సీనియర్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.