Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమిత్ షాకు కాంగ్రెస్ వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో 25 లక్షల ఎకరాల్లో రూ.3,500 కోట్ల విలువైన పంట నష్టం వాటిల్లిందని కాంగ్రెస్ పార్టీ తెలిపింది. ఈ మేరకు ఆ పార్టీ కిసాన్ సెల్ జాతీయ ఉపాధ్యక్షులు ఎం.కోదండరెడ్డి పంట నష్టాల వివరాలతో కేంద్ర హౌంమంత్రి అమిత్ షాకు వినతిపత్రం సమర్పించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తన రాజకీయ ప్రయోజనాల కోసం కంటితుడుపు చర్యగా ఢిల్లీ నుంచి బృందాన్ని పంపించిందని విమర్శించారు. ఆ బృందం రాష్ట్రంలో ప్రజలను, రైతులను, రాజకీయ పార్టీలను కలవలేదని తెలిపారు. సీఎం కేసీఆర్ కూడా జరిగిన నష్టం ఎంత? ఏ విధంగా రైతులను ఆదుకుంటారంటూ బృందాన్ని అడగలేదని ఆగ్రహం వ్యక్తం చేటశారు. ఆహార పంటకు ఎరానికి రూ.25 వేలు, పూర్తిగా కూలిపోయిన ఇండ్ల నిర్మాణానికి రూ.ఐదు లక్షలు, పాక్షికంగా నష్టపోయిన ఇండ్లకు రూ.రెండు లక్షలు, వరదల్లో చనిపోయిన వ్యక్తులకు రూ. 25 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వాణిజ్య బ్యాంకులు, ప్రయివేటు సంస్థల నుంచి తీసుకున్న రుణాల పై కనీసం రెండు సంవత్సరాల పాటు మారటోరియం విధించాలని విజ్ఞప్తి చేశారు.