Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఆర్ఎస్లో చేరిన గట్టుప్పల మండల సాధన కమిటీ చైర్మెన్ ఇడం కైలాసం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి వ్యాపకాలు, వ్యాపారాలే ఎక్కువనీ, నియోజకవర్గాన్ని పట్టించుకోకపోవడం, నిలకడలేమితనంతోనే అభివృద్ధి కుంటుపడిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి విమర్శించారు. సూర్యాపేటతో సరిమానంగా మునుగోడును అభివృద్ధి చేస్తామని మాట ఇచ్చారు. గట్టుప్పల్ మండల చిరకాల వాంఛను తీర్చిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని కొనియాడారు. ప్రపంచంలో పన్నుల ప్రధానిగా మోడీ చలామణి అవుతున్నారని విమర్శించారు. సోమవారం హైదరాబాద్‌లో మంత్రి జగదీశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి సమక్షంలో గట్టుప్పల్ మండల సాధన కమిటీ చైర్మెన్ ఇడం కైలాసం, బీమనగాని మహేశ్‌తో పాటు పలువురు కమిటీ సభ్యులు, గ్రామస్తులు టీఆర్ఎస్లో చేరారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ కర్నాటి వెంకటేశం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..కాంగ్రెస్‌కు ప్రజల్లో ఆదరణ రోజురోజుకీ తగ్గుతుందన్నారు.