Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జీవో విడుదల చేసిన రాష్ట్ర సర్కారు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణలో ఆగస్టు 8 నుంచి 22వ తేదీ వరకు స్వతంత్ర భారత వజ్రోత్సవాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా 23 మంది సభ్యులు, ఒక ప్రత్యేక ఆహ్వానితునితో ఉత్సవాల కమిటీ ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 1495ని జారీచేసింది. దీనికి చైర్మెన్‌గా రాజ్యసభ సభ్యులు కే.కేశవరావు వ్యవహరించనున్నారు. సభ్యులుగా మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్‌యాదవ్, శ్రీనివాస్‌గౌడ్, పి.సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యే, తెలంగాణ సాంస్కృతిక సారధి చైర్మెన్ రసమయి బాలకిషన్, ప్రభుత్వ సలహాదారులు కె.వి.రమణాచారి, సీఎస్ సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి, ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎమ్ఎస్.ప్రభాకర్, ఎమ్మెల్యే డి.సుధీర్‌రెడ్డి, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మెన్ జూలూరీ గౌరీశంకర్, యువజన, సాంకేతిక, పంచాయతీరాజ్, విద్యా శాఖల కార్యదర్శులు, జీహెచ్ఎంసీ కమిషనర్, సాంస్కృతిక విభాగం, ఐఅండ్‌పీఆర్ డైరెక్టర్లు, జీఏడీ కార్యదర్శి ఉంటారు.సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్ ప్రత్యేక ఆహ్వానితులుగా ఉండనున్నారు.