Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్ సేవలు
- సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు ఓపీ
నవతెలంగాణ-ధూల్‌పేట్
ఉస్మానియా హాస్పిటల్‌కు వెళ్లే పేషంట్లు.. ఓపీ లైన్ ఎంత పెద్దగా ఉంటుందో, టోకెన్ దొరుకుతుందో లేదో, వెళ్లే సరికి ఓపీ టైమ్ ఐపోతుందేమోనని ఇక ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సోమవారం నుంచి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశాలతో సాయంత్రంపూట కూడా ఓపీ సేవలు ప్రారంభమయ్యాయి. కార్పొరేటు, ప్రయివేటు ఆస్పత్రులకు దీటుగా ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో కూడా ఓపీ (బయటి రోగుల సేవ) విభాగం సేవలను సాయంత్రం పూట కూడా ఇక నుంచి నిరంభ్యంతరంగా అందించనున్నట్టు ఆస్పత్రి సూపరింటెండెంట్ తెలిపారు. ఇన్నాండ్లు కేవలం ఉదయం పూట మాత్రమే ఉండే ఓపీ సేవలు ఉండటంవల్ల రాష్ట్రంలోని ఆయా ప్రాంతాల నుంచి అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రికి వచ్చేవారు ఇబ్బంది పడేవారన్నారు. ఇకనుంచి అటువంటి ఇబ్బందులేవీ లేకుండా సోమవారం నుంచి ప్రతిరోజూ సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు ఓపీ కొసాగించనున్నట్టు తెలిపారు. కాగా, సాయం త్రం పూట ఓపీని ప్రారంభించడం పట్ల ప్రజల్లో సంతోషం వ్యక్తం అవు తోంది. ఇక్కడ సేవలు అందకపోవడంవల్ల ప్రయివేటు ఆస్పత్రిని ఆశ్రయిం చాల్సిన ఇబ్బందులు తొలగాయని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతేకాదు, ఉస్మానియా ఆస్పత్రిలోని జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్ విభాగాల్లో కూడా సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు ఓపీ సేవలను ప్రారంభించారు. రొటీన్ ల్యాబ్ ఇన్వెస్టిగేషన్లు కూడా అదే రోజున నిర్వహించి నివేదికలు అందజేస్తారు. రోగులకు మందులు ఓపీ డిస్పెన్సరీలో అందుబాటులో ఉంటాయి. అల్ట్రాసౌండ్ సేవలు కూడా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతాయి.