Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సాయంత్రంపూట మేం విధులకు హాజరుకాబోం
- డీఎంఈకి టీ-జూడా వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
డాక్టర్ల నియామకాలు లేకుండా బోధనాస్పత్రుల్లో సాయంత్రం క్లినిక్లు నిర్వహించాలనుకోవడం సరికాదని తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ (టీ-జూడా) వ్యతిరేకించింది. ఈ మేరకు సోమవారం ఆ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డాక్టర్ కార్తీక్ నాగుల, డాక్టర్ వన్య జాస్మీన్, ఉపాధ్యక్షులు డాక్టర్ డి.శ్రీకాంత్ రాష్ట్ర వైద్యవిద్య సంచాలకులు డాక్టర్ కె.రమేశ్ రెడ్డికి లేఖ రాశారు. నేరుగా నియామకాలు చేపట్టి సిబ్బంది, పీజీలపై భారం తగ్గించాలని కోరారు. ఆస్పత్రుల్లోనే వసతి సౌకర్యం కల్పించాలనీ, కేంద్ర సంస్థలు ఎయిమ్స్, పీజీఐ, రాష్ట్ర సంస్థ నిమ్స్ తో సమానంగా ఉపకార వేతనాలి వ్వాలని విజ్ఞప్తి చేశారు. ఉపకారవేతనాలను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించేంత వరకు తాము సాయంత్రం క్లినిక్ లకు హాజరయ్యేది లేదని స్పష్టం చేశారు.