Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఆజాద్ కా అమతోత్సవం లోగోను తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హన్మంతరావు, ఎన్.సురేశ్ సోమవారం హైదరాబాద్లో విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎబీఆర్ఎస్ఎమ్ పిలుపు మేరకు రాష్ట్రంలోని 15వేల పాఠశాలల్లో ఉత్సవాలను నిర్వహిస్తామన్నారు. స్వాతంత్ర ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన వీరులను స్మరించుకోవడం, దేశం కోసం అసువులు బాసిన సైనికుల కుటుంబాలను గౌరవించడం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. లోగో ఆవిష్కరణలో తపస్ అదనపు ప్రధాన కార్యదర్శి పెంటయ్య, ఉపాధ్యక్షులు లక్ష్మీకాంత్, కార్యదర్శి మల్లికార్జున్, నవీన్, రవీందర్, సి.నారాయణ రెడ్డి, ఆశోక్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.