Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రెండు వారాలుగా రాష్ట్రాన్ని భారీ వర్షాలు, వరదలు అతలాకుతలం చేస్తున్నాయనీ, దీంతో అన్ని రకాలుగా తీవ్ర నష్టం వాటిల్లిందనీ, ఈ నేపథ్యంలో జాతీయ విపత్తుగా ప్రకటించాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశం డిమాండ్ చేసింది. సోమవారం హైదరాబాద్లోని మగ్దూ ం భవన్లో ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం విజరు సారథి అధ్యక్షతన జరిగింది. కార్యవర్గం పలు తీర్మాణాలు చేసింది. భారీ వర్షాలు, వరదల వల్ల పెద్ద సంఖ్యలో పట్టణాలు, గ్రామాలు నీట మునిగిపోవడంతో వేల సంఖ్యలో ఇండ్లతో పాటు సర్వం కోల్పోయారని తెలిపింది. లక్షల ఎకరాల్లో నీరు చేరడంతో రైతులు పెద్ద ఎత్తున నష్టపోయారని పేర్కొన్నది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో అతిభారీ వర్షాలు, వరదలతో ప్రజలు, రైతులు విపత్కర పరిస్థితుల్లోకి నెట్టబడ్డారని తెలిపింది. ప్రజలకు తీవ్ర నష్టాన్ని కలిగించిన భారీ వర్షాలు, వరదలను కేంద్ర ప్రభుత్వం తక్షణమే జాతీయ విపత్తుగా ప్రకటించాలని డిమాండ్ చేసింది. జాతీయ విపత్తు సహాయ నిధి, రాష్ట్ర విపత్తు సహాయ నిధి మార్గదర్శకాల ప్రకారం వరదలతో నష్టపోయిన ప్రజానీకానికి, రైతులకు వెంటనే ఆర్థిక సహాయం అందజేయాలని విజ్ఞప్తి చేసింది.