Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మహబూబాబాద్ జిల్లాలోని చారిత్రక ప్రాధాన్యత కలిగిన 'ఇనుగుర్తి'ని నూతన మండలంగా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. మండలానికి సంబంధించిన ఉత్తర్వులను వెంటనే జారీ చేయాలని సీఎస్ సోమేశ్‌కుమార్‌ను ఆదేశించారు. దీంతో రాష్ట్రంలో మండలాల సంఖ్య 608కి చేరుకున్నది. మండల ప్రకటన కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, మాలోత్ కవిత, స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్, ఎమ్మెల్సీ రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.