Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సిక్కుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం సానుకూల దృక్పథంతో పరిశీలిస్తుందని మంత్రి కొప్పుల ఈశ్వర్ హామీనిచ్చారు. మాజీ ఐపీఎస్ అధికారి తేజ్ దీప్ కౌర్ మీనన్ నాయకత్వంలో పలువురు సిక్కు ప్రముఖులు సచివాలయంలో సోమవారం మంత్రి కొప్పుల ఈశ్వర్ ను కలిసి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఆమె తెలంగాణలోని సిక్కులలో చాలా మంది పేదరికంలో ఉన్నారనీ, ఇతర మైనారిటీలతో పాటు తమకు కూడా ప్రభుత్వ పథకాలను అమలు చేయాలని కోరారు. రాష్ట్రంలో 44 గురుద్వారాలు ఉండగా, వీటికి ఆదాయ వనరులు లేక నిర్వహణకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని వివరించారు.
వీటి పూజారీలు (గ్రంథి ),రాగీస్ ( కీర్తన్ సింగర్స్) జీవనోపాధి భారంగా ఉన్నందున, వీరికి ప్రతి నెల 7,500 రూపాయల గౌరవ వేతనం ఇవ్వాల్సిందిగా మనవి పత్రంలో పేర్కొన్నారు. ఈ విషయాలపై మంత్రి కొప్పుల సానుకూల దృక్పథంతో పరిశీలిస్తామని హామినిచ్చారు.