Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
జాయింట్ యాక్షన్ కమిటీ ఆఫ్ టీచర్స్ ఆర్గనైజేషన్(జాక్టో) చైర్మెన్‌గా జి.సదానందగౌడ్, సెక్రటరీ జనరల్‌గా ఎం.రాధాకృష్ణ ఎన్నికయ్యారు. సోమవారం హైదరాబాద్‌లోని ఎస్టీయూ భవన్లో జాక్టో కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నూతన కమిటీని ఎన్నుకున్నారు. వారితోపాటు కోశాధికారిగా కె.కృష్ణుడు, ప్రచార కార్యదర్శిగా కె.చైతన్య, కోచైర్మెన్లుగా కె.వెంకట్, సీహెచ్.శ్రీనివాస్, జి.హేమచంద్రుడు, డీవీరావు, జయబాబు, వైఎస్ శర్మ, అలీంబాబా, డిప్యూటీ సెక్రటరీ జనరల్స్‌గా లక్ష్మణ్‌నాయక్, ఎస్.విఠల్, ఎమ్ఏ నయీం, గీతాంజలి, నగేశ్‌యాదవ్, మీర్ ముంతాజ్ అలీ, ఆర్.మల్లీశ్వరి, స్టీరింగ్ కమిటీ సభ్యులుగా ఎం.గంగరాజు, అన్ని సంఘాల రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, జాక్టో అనుసంధాన కర్తగా ఎం.పర్వతరెడ్డి, సలహాదారులగా బి.భుజంగరావు, జి.మోహన్‌రెడ్డి, వేణుగోపాలస్వామి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సదానందం గౌడ్ మాట్లాడుతూ.. డీఎస్ఈ ముట్టడి విజయవంతమైందనీ, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించే దాకా జాక్టో పోరాట కార్యక్రమాలు కొనసాగుతాయని చెప్పారు.