Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మియాపూర్
హైదరాబాద్ నగరంలోని హైటెక్ సిటీ సమీపంలో ఎంఎంటీఎస్ రైలు ఢకొీని ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా చందానగర్ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకున్నది. రైల్వే సీఐ శ్రీనివాసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్నగర్ జిల్లాకు చెందిన రాజప్ప (50), కృష్ణ(45), శ్రీను(40) హఫీజ్పేట్లో నివాసం ఉంటూ కూలి పని చేసుకుంటున్నారు. వారు మధ్యాహ్నం 12 గంటల సమయంలో హఫీజ్పేట్, హైటెక్ సిటీ రైల్వే లైన్ మార్గంలో మూలమలుపు వద్ద ఎంఎంటీఎస్ రైలును గమనించకుండా పట్టాలు దాటేందుకు ప్రయత్నించారు. దాంతో రైలు ఢకొీని అక్కడికక్కడే మృతిచెందారు. పట్టాలపై విధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది గుర్తించి రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి పరిశీలించారు. మృతుల వద్ద మద్యం సీసాలు లభించడంతో మద్యం తాగి ఆ మత్తులోనే రైలు కింద పడి ఉంటారని అనుమానిస్తున్నారు. కాగా, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.