Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జూనియర్ లైన్మెన్ ప్రశ్నాపత్రం లీక్ కేసు
- మరో ఐదుగురు అరెస్ట్
నవతెలంగాణ-సిటీబ్యూరో
తెలంగాణ విద్యుత్‌శాఖ జూనియర్ లైన్మెన్ ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారంలో ఉద్యోగులే సూత్రదారులుగా ఉన్నారు. కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్, ఎస్వోటీ, సీసీఎస్, పోలీసులు రంగంలోకి దిగారు. ఇప్పటికే ప్రధాన సూత్రదారి ఏడీఈ ఫిరోజ్ ఖాన్‌ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రశ్నాపత్రం లీక్ చేయడంలో విద్యుత్‌శాఖ ఉద్యోగులే కీలక సూత్రదారులుగా గుర్తించిన పోలీసులు తాజాగా మరో ఐదుగురిని అరెస్టు చేశారు. రాచకొండ సీపీ మహేష్‌భగవత్ మంగళవారం వివరాలు వెల్లడించారు.
అంబర్‌పేట్‌కు చెందిన మహ్మద్ ఫిరోజ్‌ఖాన్ టీఎస్ఎస్పీడీసీఎల్లో ఏడీఈగా పనిచేస్తున్నాడు. కొత్తగూడెంకు చెందిన అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్ మంగళగిరి సైదులు, మిర్యాలగూడకు చెందిన కుమారీ బాషరాజు నవ్య, మిర్యాలగూడెంకు చెందిన సబ్ ఇంజినీర్ షేక్ షాజాను, నల్లగొండ జిల్లాకు చెందిన సయ్యద్ కరీముల్లా, ఎలక్ట్రీషియన్ చనగరి శివ ప్రసాద్ ముఠాగా ఏర్పాడ్డారు. పరీక్షల్లో సహకరించి, ఉద్యోగం ఇప్పిస్తే రూ.5 లక్షల వరకు ఒప్పదం చేసుకున్నారు. శివ ప్రసాద్ సెల్‌ఫోన్‌తో పరీక్షకు హాజరయ్యాడు. మైక్రోఫోన్ సహాయంతో ఏడీఈ ఫిరోజ్‌ఖాన్, అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్ సైదులు, సబ్ ఇంజినీర్ షేక్ షాజాను అభ్యర్థులకు సమాధానాలు చేరవేశారు. ఒక్కొక్క ఉద్యోగానికి రూ.5 లక్షల చొప్పున ఒప్పందం చేసుకున్నారు. అడ్వాన్స్‌గా లక్ష రూపాయలు వసూలు చేశారు.