Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధికారులకు మంత్రి హరీశ్ ఆదేశం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
విజయవాడలోని మంథని సత్యనారాయణ నేచురోపతి ఆస్పత్రిని సందర్శించి అక్కడ అందుతున్న సేవలు, భోజనం, ఇతర సదుపాయాలను అధ్యయనం చేయాలని రాష్ట్ర వైద్యారోగ్య మంత్రి టి.హరీశ్ రావు అధికారులను ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్ అమీర్ పేటలోని గాంధీ నేచర్ క్యూర్ ఆస్పత్రి స్థితిగతులపై మంత్రి సమీక్షించారు. ప్రకృతి వైద్యంలో ప్రసిద్ధి చెందిన మంథని సత్యనారాయణ సలహాలు తీసుకోవాలని హరీశ్ రావు ఈ సందర్భంగా అక్కడి, అధికారులకు సూచించారు. ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేయాలనీ, వాతవరణ ఆహ్లాదకరంగా ఉండేలా పచ్చదనం పెంచాలనీ, వంటగదిని, సామాగ్రిని సమకూర్చుకోవాలని కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, ఆయూష్ కమిషనర్ ప్రశాంతి, ప్రకృతి వైద్య నిపుణులు మంథని సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.