Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లా డీన్ ప్రొ. గాలి వినోద్ కుమార్ ఆరోపణ
- 2023 ఎన్నికల కోసం స్వచ్ఛంద ఉద్యోగ విరమణ
నవతెలంగాణ-ఓయూ
ఉస్మానియా యూనివర్సిటీ వీసీ చెప్పేదొకటైతే, చేస్తున్నది మరొకటని, ఇక్కడ పెత్తందారీ వర్గాలకు ఒక న్యాయం, అణగారిన వర్గాలకు ఇంకొక న్యాయం జరుగుతోందని ఓయూ లా డీన్ ప్రొఫెసర్ గాలి వినోద్‌కుమార్ ఆరోపించారు. మంగళవారం ఓయూలోని తన కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఓయూ లా కళాశాలలో ఒక పెత్తందారీ వర్గ ప్రొఫెసర్ ఎలా చెబితా అలా ఓయూ పెద్దలు నడుచుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇక్కడ ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు నష్టం జరుగుతోందని చెప్పారు. 2023 ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో బీసీని ముఖ్యమంత్రి చేయడమే తమ లక్ష్యమన్నారు. జులై 23న తాను స్వచ్ఛంద ఉద్యోగ విరమణ కోసం వీసీకి దరఖాస్తు చేసుకున్నట్టు తెలిపారు. 2023లో పూర్తిస్థాయి రాజకీయంలో ఉంటానని, ముఖ్యమంత్రి అభ్యర్థిగా అప్పుడు బీసీనే ఉంటారని చెప్పారు. అందుకే తాను స్వచ్ఛంద ఉద్యోగ విరమణ తీసుకుంటున్నాని తెలిపారు. సౌత్ ఇండియాలో పొలిటికల్ సదన్ అకాడమీలో 119 అభ్యర్థులను తెలంగాణ రాష్ట్రంలో పోటీ చేసే విధంగా తయారు చేశామని తెలియజేశారు. తాను ఎంపీగా పోటీ చేస్తానని, ఓయూలో జరుగుతున్న అవినీతి పై, ఉన్నత విద్య ప్రయివేటీకరణపై ఉద్యమిస్తానని తెలిపారు.