Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు
- రవీంద్రభారతిలో సినారె జయంతి
నవతెలంగాణ-కల్చరల్
తెలంగాణ సాహితీ ప్రతిష్టను దేశానికి చాటిన మహనీయుడు కవి సి.నారాయణ రెడ్డి అని వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు కొనియాడారు. తెలంగాణలో కవులే లేరన్న సమయంలో సురవరం ప్రతాప్ రెడ్డి గోల్కొండ పత్రిక ద్వారా వందల మంది కవులను చూపారని, ఆయన పరంపరను కొనసాగించిన వారు సినారె అని చెప్పారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతి ప్రధాన వేదికపై భాషా సంస్కృతిక శాఖ సౌజన్యంతో శృతి లయ ఆర్ట్స్ అకాడమీ, సీల్వెల్ కార్పొరేషన్, ఆర్ఆర్అర్ ఫౌండేషన్ ఆధ్యర్యంలో మంగళవారం డాక్టర్ సి.నారాయణ రెడ్డి జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా సంగీత దర్శకుడు సాలూరి కోఠిని లయ కిరీటి, గీతా రచయిత సుద్దాల అశోక్ తేజను కవి సామ్రాట్, సంస్కృతిక సంస్థ నిర్వాహకుడు ఆకృతి సుధాకర్‌ను వైవిధ్యరత్న బిరుదులతో మంత్రి సత్కరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. తెలుగు భాష ఉన్నంత కాలం సినారె ప్రజల హృదయాల్లో నిలిచి ఉంటారన్నారు.
అధ్యక్షత వహించిన ఎమ్మెల్సీ మధుసూదనాచారి మాట్లాడుతూ.. ప్రతికూల పరిస్థితులను అధిగమించి ముందుకు సాగిన వారే జీవితంలో విజేతలు కాగలరని చెప్పారు. ఇందుకు ఉదాహరణ సినారె, అశోక్ తేజలేనని అన్నారు. కార్యక్రమంలో సీల్ వెల్ బండారు సుబ్బారావు, పోలీస్ హౌసింగ్ బోర్డ్ చైర్మెన్ కొలేటి దామోదర్, దైవజ్ఞ శర్మ, రామచంద్రరావు, శంకర్ గుప్త పాల్గొన్నారు.