Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మంచిర్యాల జిల్లా కలెక్టర్, కొంత మంది తహసీల్దార్లు జారీచేసిన ఉత్తర్వులను విరమించుకోవాలని వీఆర్వోల జేఏసీ డిమాండ్ చేసింది. జేఏసీ చైర్మెన్ గోల్కొండ సతీష్, కో చైర్మెన్ రవి నాయక్, అడిషనల్ సెక్రెటరీ జనరల్ పల్లెపాటి నరేష్, వైస్ చైర్మెన్ ఆకుల రవీందర్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మంగళవారం జరిగిన విధులకు దూరం కార్యక్రమం విజయవంతమైనట్టు వారు తెలిపారు. రాష్ట్రంలో ఏ ఒక్క వీఆర్వో కు నష్టం జరిగిన సర్వీస్ పరమైన ఇబ్బందులు జరిగిన దానికి పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వమే వహించాలని హెచ్చరించారు. 23 నెలల నుంచి అనేక రకాల ఇబ్బందులతో, మానసిక ఒత్తిడితో వీఆర్వోలు గుండె నొప్పులతో పిట్టల్లాగా రాలిపోతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. స్పష్టమైన విధులతో పాటు హౌదా, సర్వీస్ రూల్స్ ఇచ్చేంత వరకు విధులకు దూరంగా ఉంటూ నిరసన తెలుపుతామని స్పష్టం చేశారు. వీఆర్వోల కార్యక్రమాలకు సహకరించాలని జిల్లా కలెక్టర్లు, ఆర్డీవోలకు విజ్ఞప్తి చేశారు.