Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అవినీతి అధికారులను సస్పెండ్ చేయాలి:డీవైఎఫ్ఐ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
జేఎల్ఎం పరీక్షలో ప్రశ్నాపత్రం లీకేజికి పాల్లడిన అవినీతి అధికారులను సస్పెండ్ చేయాలనీ, పరీక్షను రద్దు చేసి తిరిగి రాత పరీక్ష నిర్వహించాలని అఖిల భారత ప్రజాతంత్ర యువన సంఘం(డీవైఎఫ్ఐ) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కోట రమేష్, ఆనగంటి వెంకటేష్ మంగళవారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డికి వినతి పత్రం అందజేశారు.జులై 17 న నిర్వహించిన జూనియర్ లైన్ మెన్ పరీక్షల్లో పేపర్ లీకేజికి పాల్పడిన అధికారులను సస్పెండ్ చేయాలని,పరీక్ష రద్దుచేసి మరలా జెఎల్ఎమ్ పరీక్ష ని నిర్వహించాలని పేర్కొన్నారు. లీకేజి ఘటన జరిగి పదిరోజులు గడుస్తున్నా..ఇంత వరకు సంబంధిత బాధ్యులపై చర్యలు తీసుకోకపోవటంలో అంతర్యం ఎంటని ప్రశ్నించారు. వేలాది మంది నిరుద్యోగులకు తీవ్ర నష్టం చేసే ఇలాంటి అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం, సంబంధిత శాఖ, మంత్రి ఇంత వరకు స్పందించకపోవడంతో పలు అనుమానాలను నిరుద్యోగులు వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఇప్పటికైనా అవినీతి అధికారులపై చట్ట పర చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. వెంటనే నియామక పరీక్షను నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ జేఎల్ఎం పరీక్షను రద్దు చేస్తామనీ, ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే పరీక్ష రద్దు ప్రకటిస్తామని తెలిపారు. అవినీతికి పాల్పడిన సంబంధిత శాఖ అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జావీద్ నాయకులు వేణు పాల్గొన్నారు.