Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మావోయిస్టు కేంద్ర కమిటీ లేఖ
నవతెలంగాణ బ్యూరో
మావోయిస్టు పార్టీ వ్యవస్థాపక నాయకులు చారు ముజుందార్ 50వ వర్ధంతి, కన్హారు చటర్జీ 40వ వర్ధంతిలను ఈ నెల 28 నుంచి ఆగస్ట్ 3 వరకు నిర్వహించాలని ఆ పార్టీ కేంద్ర కమిటి మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. భారత నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని పురోగమింపజేసే లక్ష్యంతో శత్రువు వ్యూహాత్మక ''సమదాన్ ప్రహర్ '' దాడిని ఓడించాలని మావోయిస్టు కేంద్ర కమిటీ పిలుపునిచ్చింది. మావోయిస్టు పార్టీకి సంబంధించిన అన్ని కేడర్లు ఈ వర్ధంతులను ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులను కోరింది.