Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దీర్ఘకాలిక సమస్యకు పరిష్కారం
- సీఎంకు కృతజ్ఞతలు:ఇంజినీర్లు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
దశాబ్దాల తరబడి పెండింగ్‌లో ఉన్న సాగునీటి శాఖ ఇంజినీర్ల ఉద్యోగోన్నతులు కొలిక్కి వచ్చాయి. ప్రమోషన్లు కల్పిస్తూ సీఎం కేసీఆర్ మంగళవారం ఆదేశాలు జారీచేయడంతో ఆ శాఖలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో సీనియారిటీ సమస్యను సైతం పరిష్కరించనట్టయింది. ఉమ్మడి రాష్ట్రం నుంచి ఆయా కోర్టుల్లో ఉన్న పెండింగ్ కేసుల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చొరవతోనే ఉద్యోగోన్నతులకు కారణమని ఇంజినీర్లు ఆనందంతో చెప్పారు. ప్రత్యేక కమిటీ ద్వారా ఉద్యోగోన్నతుల సమస్యను త్వరితగతిన పరిష్కరించేందుకు వీలైనట్టు తెలిపారు.
అడ్‌హక్ ప్రమోషన్లతోపాటు నష్టం జరగకుండా పేస్కేళ్ల సవరణ కూడా చేసినట్టు తెలంగాణ ఇరిగేషన్ గ్రాడ్యుయేట్ ఇంజినీర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్. వెంకటేశ్వర్లు, కార్యనిర్వాహఖ అధ్యక్షులు ఎన్.శ్రీధర్, సెక్రెటరీ జనరల్ బి. గోపాలకృష్ణారావు ముఖ్యమంత్రి కేసీఆర్, స్పెషల్ సీఎస్ రజత్‌కుమార్, ఇంజినీర్ ఇన్ చీఫ్ సి.మురళీధర్, బి.అనిల్‌కుమార్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రభుత్వ నిర్ణయంతో ఇన్చార్జి ప్రాతిపదికన పనిచేస్తున్న ఇంజినీర్లకు రివర్షర్లను నివారించడానికి, సీఈ, ఎస్ఈ పోస్టులకు సూపర్‌న్యూమరీ పోస్టులను సృష్టించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. అలాగే మరో 12 మందికి సీఈలకు ఉద్యోగోన్నతి లభించనున్నట్టు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.