Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర ప్రభుత్వ ప్రకటన రాజ్యాంగ విరుద్ధం
- తెలంగాణ గిరిజన సంఘం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
గిరిజన రిజర్వేషన్ల పెంపు ఇప్పట్లో సాధ్యంటూ కాదని పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం ప్రకటించటం రాజ్యాంగాన్ని ఉల్లంఘించటమే అవుతుందని తెలంగాణ గిరిజన సంఘం(టీజీఎస్) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం ధర్మానాయక్, ఆర్ శ్రీరాంనాయక్ మంగళవారం ఒక ప్రకటనలో విమర్శించారు. బీసీ-ఈ రిజర్వేషన్ల సమస్య సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న నేపథ్యంలో అది పరిష్కారం అయ్యేవరకు గిరిజన రిజర్వేషన్లు పెంచడం సాధ్యం కాదని చెప్పడం బాధ్యతా రాహిత్యమే అవుతుందని పేర్కొన్నారు. ఈ సమస్యను బీసీ-ఈతో ముడిపెట్టటం అన్యాయమని తెలిపారు. ఈ విషయంలో టీఆర్ఎస్ పార్టీకి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా..ఆ పార్టీ పార్లమెంటు సభ్యులు సభలో నిలదీయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 2011 జనాభా లెక్కల ప్రకారం 6 శాతం నుంచి 9.08 శాతానికి రిజర్వేషన్లు పెంచుకోవటానికి కేంద్ర హోం శాఖ అనుమతివ్వాలని కేంద్ర గిరిజన వ్యవరాలశాఖ కోరిందని గుర్తుచేశారు. దీనిపై నాలుగేండ్లుగా జాప్యం చేసిన కేంద్ర చేసిన కేంద్ర హోం శాఖ.. ఇప్పుడు బీసీ- ఈ సమస్యను గిరిజన రిజర్వేషన్ల పెంపు సమస్యతో ముడిపెట్టడం బీజేపీ అవకాశవాద రాజకీయాలకు నిదర్శనమని విమర్శించారు. రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్లను పెంచాల్సిన కేంద్ర ప్రభుత్వం, వీటపై రాజకీయం చేయడం అన్యాయమని పేర్కొన్నారు. రాష్ట్రంలో గత ఎనిమేదేండ్ల నుంచి విద్య, ఉద్యోగ రంగాల్లో గిరిజనులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. ఇలాంటి పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం ఈ ప్రకటన వల్ల మరింత నష్టం జరిగే అవకాశం ఉందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీ- ఈతో కలిపి గిరిజన రిజ్వేషన్ల బిల్లును కేంద్రానికి పంపడమే ఒక మోసమని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అదే సమస్యతో ముడిపెట్టటం చూస్తే.. రెండు ప్రభుత్వాలు ఆడుతున్న నాటకంలో భాగమేనన్న అనుమానాలు కలుగుతున్నాయని పేర్కొన్నారు. బీసీ- ఈ లో రిజర్వేషన్ల పెంపు ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన నిర్ణయమని తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి దాంతో ఎలాంటి సంబంధం లేకున్నా కేంద్రప్రభుత్వంతోపాటు, బీజేపీీ నాయకులు పదే పేదే మాట్లాడటం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. గిరిజనులపట్ల బీజేపీకున్న చిత్తశుద్ది ఈ ప్రకటనతో బైటపడిందని తెలిపారు. అడగకుండానే అగ్రవర్ణ పేదలకు ఎకనామిక్ వీకర్ సెక్షన్ల (ఈడబ్ల్యుఎస్) పేరుతో ఆగమేఘాలపై 10 శాతానికి రిజర్వేషన్ కల్పిస్తూ పార్లమెంటులో చట్టం చేసిన కేంద్రం, గిజనుల విషయంలో ఎందుకు వివక్ష చూపుతుందో చెప్పాలని రాష్ట్ర బీజేపీ నాయకులను వారు ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణం
ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని నిర్వహించి గిరిజన రిజర్వేషన్ పెంపు బిల్లును ఆమోదించి, ప్రత్యేక తీర్మానం కేంద్రానికి పంపాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం రెండు వర్గాల మధ్య తగాదా పెట్టే వైఖరి కాకుండా గిరిజనులకు రాజ్యాంగం కల్పించిన హక్కుల ఆధారంగా 9.08 శాతానికి పెంచుకోవడానికి అనుమతి ఇవ్వాలని కోరారు. లేదంటే ఉద్యమం తప్పదని హెచ్చరించారు.