Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నల్లబ్యాడ్జీలతో రెండో రోజు టీచింగ్ డాక్టర్ల నిరసన
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తమ డిమాండ్లను నెరవేర్చకుంటే బుధవారం తదుపరి కార్యాచరణ ప్రకటిస్తా మని తెలంగాణ టీచింగ్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (టీటీజీడీఏ) హెచ్చరించింది. ఆందోళనల్లో భాగంగా రెండో రోజైన మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా బోధనాస్పత్రులు, మెడిక ల్ కాలేజీల్లో వేలాది మంది డాక్టర్లు నల్లబ్యాడ్జీలతో నిరసన కొనసాగిం చారు. బుధవారం వరకు వేచి చూస్తామనీ, అప్పటికీ డిమాండ్ల పరి ష్కారానికి సానుకూల నిర్ణయం రాకపోతే తదుపరి కార్యాచరణ ప్రకటి స్తామని హెచ్చరించారు. ఆస్పత్రుల సూపరింటెం డెంట్లకు డిమాండ్ల తో కూడిన వినతిపత్రాలను సమర్పించారు. శాశ్వత ప్రాతిపదికన డీఎంఈ పోస్టును సష్టించాలనీ, 56 నెలల పీఆర్సీ బకాయిలను చెల్లిం చాలనీ, సాధారణ బదిలీలను చేపట్టాలనీ, ఈఎల్ ఎన్క్యాష్మెంటు, కెరీర్ అడ్వాన్సుమెంటు స్కీం అమలు చేయాలనే డిమాండ్లతో డాక్టర్లు నిరసన చేస్తున్న సంగతి తెలిసిందే. నిరసన ప్రదర్శనల్లో తెలంగాణ ప్రభుత్వ బోధనా వైద్యుల సంఘం అధ్యక్షులు డా.అన్వర్ , ప్రధాన కా ర్యదర్శి డా జలగం తిరుపతి రావు, ట్రెజరర్ డా.కిరణ్ ప్రకాష్ , రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ కిరణ్ మాదాల, డా. ప్రతిభా లక్ష్మి ,లోకల్ యూ నిట్ అద్యక్షులు, కార్యదర్శులు, ట్రేజరర్లు , ఇతర వైద్యులు పాల్గొన్నారు.
డాక్టర్లంతా వ్యతిరేకిస్తున్నా ఇన్ ఛార్జీ డీఎంఈగా ఎందుకు?...డాక్టర్ బొంగు రమేశ్
శాశ్వత ప్రాతిపదికన డీఎంఈ పోస్టును సష్టించకుండా ప్రభుత్వం తాత్సారం చేయడం తగదని మెడికల్ జేఏసీ చైర్మెన్ డాక్టర్ బొంగు రమేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్ ఛార్జీ డీఎంఈ డాక్టర్ కె.రమేశ్ రెడ్డి ఏకపక్ష నిర్ణయాలు, ఒంటెద్దు పోకడలతో డాక్టర్లు విసిగిపోయారని తెలిపారు. ఉస్మానియా ఆస్పత్రిలో జరిగిన నిరసన ప్రదర్శనలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో 2,000 మంది బోధనా వైద్యులు ఒక వైపుంటే, డీఎంఈ మరో వైపున్నారనీ, ప్రభుత్వం సముచిత నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.