Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పనులు త్వరగా పూర్తి చేయాలి
- మంత్రి వేముల ప్రశాంత్ రెెడ్డి
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
నూతన సెక్రెటేరియట్ నిర్మాణ పనుల్లో ఇంకా వేగం పెంచి సీఎం కేసీఆర్ విధించిన గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అధికారులు, వర్కింగ్ ఏజెన్సీని అదేశించారు. మంగళవారం ఆయా పనులను క్షేత్రస్థాయి లో పరిశీలించారు. ముందుగా సెక్రెటేరియట్ నిర్మాణ ప్రాంగణానికి చేరుకుని ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పనులు పరిశీ లించారు. సుమారు నాలుగు గంటల పాటు నిర్మాణ ప్రాంగణమంతా కలియతిరిగారు. గ్రాండ్ ఎంట్రీ, రెడ్ సాండ్ స్టోన్ జీఆర్సి క్లాడింగ్ పనులు, పోర్టికో స్లాబింగ్ పను లు, విండోస్ స్ట్రక్చరల్ గ్లేనింగ్, కాంపౌండ్ వాల్ రెయిలింగ్ పనులు, సీఎం చాంబర్, మంత్రుల చాంబర్లు, సెక్రెటరీల చాంబర్లు, వివిధ శాఖలకు సంబంధించిన వర్క్ స్టేషన్ల ఏరియా పనుల పురోగతిని తనిఖీ చేశారు. అక్కడే అధికారులతో సమీక్ష సమా వేశం నిర్వహించి సీఎం ఛాంబర్,మంత్రుల ఛాంబర్,ఆఫీసర్స్ చాంబర్స్ ఫర్నీచర్ డిజైన్లు ఫైనల్ చేశారు.
సీఎం ఛాంబర్‌తో పాటు వీవీఐపీ లాంజ్‌లో ఉపయోగించే టైళ్లను తిలకించారు. గ్రానైట్ ఫ్లోర్ స్టెప్స్ టైళ్లు,కోర్ట్ యార్డ్, ప్రైమ్ ఏరియా లైటింగ్పైనా తుదినిర్ణయం తీసుకున్నారు. గ్రాండ్ ఎంట్రీ మెయిన్ డోర్‌కు సంబంధించి ఆర్కిటెక్ట్ ఆస్కార్ పొన్ని రూపొందించిన పలు డిజైన్లను పరిశీలించారు. గతంలో చెప్పినట్టుగా కూలీలను 1450 నుంచి 2,118కి పెంచి నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేస్తున్నారు. మధ్యాహ్నాం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం హుస్సే న్‌సాగర్ ఒడ్డున నిర్మిస్తున్న అమరవీరుల స్మారక చిహ్నం పనుల పురోగతిని కూడా పరిశీలించారు. ఫినిషింగ్ పనుల పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. మెయిన్ ఎం ట్రీ, తెలంగాణ తల్లి విగ్రహం, గార్డెన్ ఏరి యా, పైఅంతస్థులో నిరంతరం వెలుగుతున్న జ్యోతి ఆకతి వచ్చే నిర్మాణాన్ని, మ్యూజియం, గ్యాలరీతోపాటు అంతస్థులవారీగా పనులు పరిశీలించారు. మంత్రి వెంట ఇంజినీర్ ఇన్ చీఫ్ ఐ.గణపతి రెడ్డి, ఎస్.ఈలు సత్య నారా యణ, హఫీజుద్దిన్, లింగారెడ్డి, ఈ.ఈలు శశిధర్, నర్సింగరావు, ఆర్కిటెక్ట్ ఆస్కార్, వాస్తు నిపుణులు సుధాకర్ తేజ పాల్గొన్నారు.