Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీహెచ్ డాక్టర్ శ్రీనివాసరావు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో మంకీపాక్స్ సోకినట్టు తొలి అనుమానితుడైన కామారెడ్డికి చెందిన ఇబ్రహీంకు ఆ వ్యాధి లేదని తేలింది. రిపోర్ట్ నెగెటివ్ వచ్చింది. ఈ మేరకు అతనికి మంకీపాక్స్ లేదంటూ రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ జి.శ్రీనివాసరావు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నెల ఆరున బాధితుడు కువైట్ నుంచి రాగా 20 నుంచి మంకీపాక్స్ ఉన్నట్టు అనుమానించిన స్థానిక వైద్యులు అతన్ని మంకీపాక్స్ నోడల్ ఆస్పత్రి అయిన హైదరాబాద్ నల్లకుంటలోని ఫీవర్ ఆస్పత్రికి తరలించి పర్యవేక్షించారు. బాధితుని నమూనాలను పుణె ల్యాబ్‌కు పంపించగా మంగళవారం ఫలితాలొచ్చాయి. అయితే బాధితునికి చికెన్ పాక్స్ ఉన్నట్టు అనుమానిస్తున్నారు.