Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఢిల్లీలో రెండో రోజు సీఎం కేసీఆర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటలోనే ఉన్నారు. అయితే తన పర్యటన రెండో రోజైన మంగళవారం ఆయన అక్కడ ఎవరెవరితో భేటీ అయ్యారు..? ఎక్కడెక్కడకు వెళ్లారనే అంశాలు తెలియరాలేదు. సంబంధిత అంశాలేవీ బయటకు పొక్కకుండా సీఎంవో అధికారులు, టీఆర్ఎస్ నేతలు జాగ్రత్త పడ్డారు. అయితే ఆయన 'తాను కలవాలనుకున్న వారిని మాత్రం ఇప్పటికే కలిశారనే' వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు సీఎం... నూతన రాష్ట్రపతి ద్రౌపతి ముర్మును మర్యాదపూర్వకంగా కలిసే అవకాశాలున్నాయని తెలిసింది. అందుకను గుణంగా సీఎంవో అధికారులు అపాయింట్మెంట్ కోరినట్టు సమాచారం. ఒకవేళ అపాయింట్మెంట్ దొరికితే ఆయన బుధవారమే రాష్ట్రపతితో భేటీ అవుతారనిట టీఆర్ఎస్ వర్గాలు వివరించాయి.