Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : క్యాంపస్ ప్లేస్మెంట్లో వెల్లూర్ ఇన్స్ట్యూట్ ఆఫ్ టెక్నలాజీ (విట్) విద్యార్థులకు దిగ్గజ టెక్ కంపెనీల్లో భారీ ప్యాకేజీ లభించింది. ప్రతీ ఏడాది లాగే ఈ సారి కూడా తమ విద్యార్థులు పెద్ద మొత్తంలో ఉద్యోగాలు సాధించారని పేర్కొంది. మైక్రోసాఫ్ట్, డిఇ షా, మోర్గాన్ స్టాన్లే, ఎయిర్బిఎన్బి, మీడియా నెట్, టిసిఎస్ తదితర సంస్థల్లో మంచి ప్యాకేజీలతో ప్రీ ప్లేస్మెంట్లు పొందారని వెల్లడించింది. వీరది 2023లో గ్రాడ్యూయేషన్ పూర్తి కానుందని తెలిపింది. తుది సంవత్సరంలో ఉన్న తమ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విద్యార్థులైన అమిత్ అగర్వాల్, సార్థక్ భరద్వాజ్‌లకు డాటా అనలిటిక్స్ కంపెనీ మోటోర్క్ రూ.1.02 కోట్ల వార్షిక ప్యాకేజీని ఆఫర్ చేసిందని తెలిపింది.