Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్చరల్
ఈ నెల 29న విఖ్యాత కవి, పద్మ భూషణ్ డాక్టర్ సి. నారాయణరెడ్డి 91వ జయంతిని పురస్కరించుకొని ప్రముఖ ఒరియా రచయిత్రి, పద్మభూషణ్ పురస్కారం గ్రహీత ప్రతిభారాయ్కి సినారె విశ్వంభర జాతీయ సాహిత్య పురస్కారం బహూకరించనున్నట్టు సుశీల నారాయణ రెడ్డి ట్రస్ట్ కార్యదర్శి జె.చెన్నయ్య, మానేజింగ్ ట్రస్ట్ గంగా ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హైదరాబాద్లోని రవీంద్రభారతిలో 29 సాయంత్రం జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, విశిష్ట అతిథిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరుకానున్నట్టు తెలిపారు. రాష్ట్ర మంత్రి నిరంజన్ రెడ్డి సభకు అధ్యక్షత వహిస్తారు. సినారె ప్రసంగాలు వ్యాసాలతో కూడిన వ్యాస పూర్ణిమ గ్రంథ ఆవిష్కరణ, సినారె గీతాలకు దీపికా రెడ్డి బృందం నృత్య రూపకం ప్రదర్శన ఉంటాయని ట్రస్టు కమిటీ పేర్కొన్నారు.