Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బాసర ట్రిబుల్ఐటీలో విద్యార్థి చావుకు సీఎం కేసీఆరే కారణమని వైఎస్ఆర్టీపీ అధ్యక్షులు వైఎస్ షర్మిల బుధవారం ఒక ప్రకటనలో విమర్శించారు. విద్యార్థులకు కలుషిత ఆహారం పెట్టటమే ఆ చావుకు కారణమని పేర్కొన్నారు. సరైన తిండి పెట్టండంటూ విద్యార్థులు దీక్షలు చేసినా పట్టింపు లేదని విమర్శించారు. సర్కారు మాటిచ్చిన నెలలోపే కలుషిత ఆహారానికి వందల మంది విద్యార్థులు ఆస్పత్రి పాలయ్యారని తెలిపారు. ఈ తిండి తింటే చస్తామని మొత్తుకున్నా మొద్దు నిద్రపోతున్న సర్కార్ స్పందించలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంకెంతమందిని బలితీసుకుంటారో చెప్పాలని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం కండ్లు తెరవాలని సూచించారు.