Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి వేముల
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
భారీ వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులపై మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సమీక్షించారు. అనంతరం బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు తాత్కాలిక పునరుద్ధరణ కోసం రూ.పది కోట్లు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. రాష్ట్ర రహదారులు 1,733 కిలోమీటర్ల పొడవున దెబ్బతిన్నాయని తెలిపారు. వాటి మరమ్మతులకు రూ.379.50 కోట్లు అవసరమవుతాయని వివరించారు. 8.4 కిలోమీటర్ల మేర రోడ్లు తెగిపోయాయని పేర్కొన్నారు. వాటి పునరుద్ధరణకు రూ.13.45 కోట్లు, 39.8 కిలోమీటర్ల పొడవైన రోడ్లు కోతలకు గురయ్యాయని వివరించారు. వాటికి రూ.7.10 కోట్లు అవసరమవుతాయని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 412 కల్వర్టులు దెబ్బతిన్నాయని తెలిపారు. వాటి మరమ్మతులకు రూ.98.19 కోట్లు ఖర్చవుతాయంటూ సంబంధిత ఇంజినీర్లు అంచనా వేశారని వివరించారు. ప్రజల రాకపోకలకు ఇబ్బంది లేకుండా తాత్కాలికంగా రోడ్ల పురరుద్ధరణకు రూ.10 కోట్లు మంజూరు చేశామని తెలిపారు.