Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ) ద్వారా రైతులతోపాటు విద్యార్థులకు సహకారం అందించనున్నట్టు మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లోని మంత్రుల నివాస సముదాయం లో డీసీసీబీ ద్వారా విదేశీ విద్య కోసం రుణం అందుకున్న తొలి విద్యార్థి కరకాల హేమంత్ రెడ్డిని మంత్రి సన్మానించి, రూ.23 లక్షల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉన్నత చదువులకు డీసీసీబీ చేయూతనిస్తుందని చెప్పారు. దేశ, విదేశీ ఉన్నత చదువుల కోసం విద్యార్థులకు రుణాలతో పాటు త్వరలోనే గృహ రుణాలకు శ్రీకారం చుడుతున్నామన్నారు. ఉన్నత విద్య పేదలకు అందని ద్రాక్ష కాకూడన్నదే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. పేద విద్యార్థులకు విదేశీ విద్య కోసం కూడా అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధి కింద ప్రభుత్వం రూ.20 లక్షల సాయం అందిస్తున్నదని చెప్పారు.ఈ క్రమంలో డీసీసీబీ ముందుకు రావడం అభినందనీయమన్నారు. యూఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, కజకి స్తాన్, రష్యాలో ఇంజనీరింగ్ తర్వాత ఎంఎస్, ఎంబీబీఎస్ చదువులకు విద్యార్థుల ఆసక్తి పెరిగిందని చెప్పారు. ప్రతిభ గల విద్యార్థులు డీసీసీబీ రుణాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి పాలమూరు డీసీసీబీ చైర్మన్ నిజాం పాషా పాల్గొన్నారు.