Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైదరాబాద్‌తో పాటు, పట్టణాల్లోని పరిస్థితులపై మంత్రి కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వర్షాల నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు మిగతా నగరాలు, పట్టణాల్లోని లోతట్టు ప్రాంతాలపై శ్రద్ధ పెట్టాలని పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు అధికారులను ఆదేశించారు. బుధవారం ప్రగతిభవన్ నుంచి జీహెచ్ఎంసీ, జలమండలి, పురపాలక శాఖ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రస్తుత పరిస్థితులపై సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. ప్రాణ నష్టం జరగకుండా చూడటమే లక్ష్యంగా పనిచేయాలని ఆదేశించారు. హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాల్లోని భారీ వర్షాల వలన ప్రభావిత ప్రాంతాలపైన ప్రధానంగా దృష్టి సారించి సహాయక చర్యలు వేగంగా చేపట్టాలని సూచించారు. వర్షాలు ఇలాగే కొనసాగితే చేపట్టాల్సిన ముందస్తు జాగ్రత్త చర్యలపైన కూడా ఇప్పటినుంచే సిద్ధంగా ఉండాల న్నారు. కూలే దశలో ప్రమాదకరంగా ఉన్న పురాతన భవనాలను కూల్చేయాలని ఆదేశించారు. స్థానికంగా ఉన్న పోలీస్, సాగునీటి, విద్యుత్, రెవెన్యూ శాఖలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. హైదరా బాద్‌తో పాటు పరిసర పురపాలికల్లోని యంత్రాం గం, జలమండలి కలిసి వరద నివారణ చర్యలు తీసు కోవాలన్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టగానే రోడ్ల మరమ్మతులు ప్రారంభించాలని ఆదేశించారు.