Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు బదిలీలు, పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ గురువారం పాఠశాల విద్యాశాఖ సంచాలకులు (డీఎస్ఈ) కార్యాలయాన్ని ముట్టడించనున్నట్టు తెలంగాణ రాష్ట్ర మోడల్ స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ (టీఎస్ఎంఎస్టీఎఫ్) పిలుపు నిచ్చింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బి కొండయ్య, కార్యదర్శి ఎస్ మహేష్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. బదిలీలు, పదోన్న తుల షెడ్యూల్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 43 శాతం రాని టీచర్లకు నోషనల్ సర్వీసు ఇస్తూ వేతన తేడాలు సవరించాలని కోరారు. అదనపు స్వీపర్, పీడీలను నియమించాలని తెలిపారు. హెల్త్‌కార్డులు, మెడికల్ రీయింబర్స్మెంట్ సౌకర్యం కల్పించాలని సూచించారు. మోడల్ స్కూల్ సిబ్బందికి 010 పద్దు కింద జీతాలు చెల్లించాలని పేర్కొన్నారు. ఖాళీపోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.