Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమస్యలు పరిష్కరించాలని తహసీల్ ఎదుట ధర్నాలు
- పలు పార్టీల మద్దతు
నవతెలంగాణ-విలేకరులు
పేస్కేల్ ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా తహసీల్దార్ కార్యాలయాల ఎదుట వీఆర్ఏలు చేస్తున్న దీక్షలు బుధవారం కొనసాగాయి. పలు జిల్లాల్లో వినూత్నంగా నిరసన తెలుపారు. కాగా, వీరి దీక్షలకు పలు రాజకీయపార్టీలు మద్దతు తెలిపాయి.
ఖమ్మం జిల్లా కూసుమంచి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం నుంచి బస్టాండ్ సెంటర్ వరకు వీఆర్ఏలు బోనాలు నెత్తిన పెట్టుకొని నిరసన ర్యాలీ చేపట్టారు. చింతకానిలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి మడిపల్లి గోపాలరావు సమ్మెకు సంఘీభావం తెలిపారు. ఇల్లందులో మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, దుమ్ముగూడెంలో సీపీఐ(ఎం) జిల్లాకమిటీ సభ్యులు వంశీకృష్ణ, అశ్వారావుపేటలో సీఐటీయూ నాయకులు మద్దతు తెలిపి దీక్షలో కూర్చొన్నారు. చండ్రుగొండలో వీఆర్ఏ సమ్మెకు గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మూడు బాలాజీనాయక్ సంఘీభావం తెలిపారు.
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్ఏలు ఒంటికాలుపై నిలబడి నిరసన తెలిపారు. వీరి దీక్షకు సీఐటీయూ నాయకులు మద్దతు తెలిపారు. నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఒంటి కాలుపై నిలబడి నిరసన తెలిపారు. వీరి దీక్షకు ఏఐటీయూసీ నాయకులు మద్దతు తెలిపారు.
సూర్యాపేట జిల్లాలో చివ్వెం, సూర్యాపేట, ఆత్మకూర్ఎస్, తుంగతుర్తి, తిరుమలగిరి, కోదాడ, మఠంపల్లి, మునగాల, నూతనకల్ తదితరల మండలాల్లో కొనసాగింది. సీపీఐ(ఎం) , బీఎస్పీ ఆధ్వర్యంలో సమ్మెకు మద్దతు తెలిపి మాట్లాడారు. నల్లగొండ జిల్లాకేంద్రంలోని వీఆర్ఏల సమ్మెకు వైఎస్ఆర్టీపీ జిల్లా నాయకులు పర్వతం వేణు మద్దతు తెలిపి మాట్లాడారు.
యాదాద్రిభువనగిరి జిల్లాకేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం చేస్తున్న దీక్షకు జిల్లా గౌరవాధ్యక్షులు కల్లూరి మల్లేశం సమ్మె శిబిరాన్ని సందర్శించి మాట్లాడారు. మోత్కూరు, చౌటుప్పల్ మండలాల్లో సమ్మె కొనసాగింది.
నిర్మల్ జిల్లాలో సమస్యలు పరిష్కరించాలని వీఆర్ఏలు చేస్తున్న నిరవధిక దీక్షా శిబిరాన్ని కుభీర్ మండలంలో నిర్మల్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు రామారావు పటేల్ సందర్శించి మద్దతు తెలిపారు. తాంసి మండలంలో వీఆర్ఏలు మోకాళ్లపై కుర్చోని నిరసన తెలిపారు. లక్ష్మణచాంద మండలంలో బీజేపీ సీనియర్ నాయకులు మల్లికార్జున్రెడ్డి వీఆర్ఏలకు మద్దతు తెలిపారు. జన్నారం మండలంలో కొనసాగుతున్న వీఆర్ఏల నిరవధిక సమ్మెకు వీఆర్వోల సంఘ నాయకులు, సీఐటీయూ నాయకులు మద్దతు తెలిపారు.