Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు
- ముగిసిన రాష్ట్ర కమిటీ సమావేశాలు... పలు తీర్మానాలు ఆమోదం
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
ప్రజాసమస్యలపై నిరంతరం పోరాడాలని సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు ఆ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈనెల 25న హనుమకొండ జిల్లా కాజీపేటలోని ఫాతిమానగర్‌లోని బాలవికాస భవన్లో సోమవారం మొదలైన ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశాలు బుధవారం ముగిశాయి. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు అధ్యక్షతన జరిగిన సమావేశాల్లో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పలు తీర్మానాలను ప్రతిపాదించారు. దీనికి రాష్ట్ర కమిటీ సభ్యులు ఆమోదించారు.
తీర్మానాలు :
వ్యవసాయ కార్మికుల సంక్షేమానికి కేంద్రం సమగ్ర శాసనం చేయాలి వ్యవసాయ రంగంలో వ్యవసాయ కార్మికుల పాత్ర కీలకమైనది. వ్యవసాయ కార్మికుల సంక్షేమానికి వారి హక్కుల రక్షణకు ప్రత్యేక అధికారాలతో యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తూ సమగ్ర చట్టం చేయాలి. గ్రామాలలో రిజిస్టర్ ద్వారా వ్యవసాయ కార్మికుల పేర్లను నమోదు చేసి గుర్తింపు కార్డులు ఇవ్వాలి. ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలి. ఎక్సైజ్ రెవెన్యూ కస్టమ్స్ మార్కెటింగ్ తదితర ప్రభుత్వ సంస్థల రాబడి ఆదాయాల నుంచి ఈ నిధిని సమకూర్చాలి. రాష్ట్రంలో 73 షెడ్యూల్ పరిశ్రమలలో కనీస వేతనాల జీవోలను విడుదల చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది గత ఎనిమిది సంవత్సరాలుగా కొత్త కనీస వేతనాల జీవోలని ఏ ఒక్కదాన్ని విడుదల చేయలేదని సమావేశం విమర్శించింది తక్షణమే 73 షెడ్యూల్ పరిశ్రమల కనీస వేతనాల జీవోలను విడుదల చేయాలని రాష్ట్ర కమిటీ సమావేశం డిమాండ్ చేసింది. రాష్ట్ర అసెంబ్లీలో ముఖ్య మంత్రి ప్రకటన మేరకు పోడు భూముల దరఖాస్తులను పరిశీలించి హక్కు పత్రాలను ఇవ్వాలని గిరిజనులపై ఆదివాసీలపై ప్రభుత్వ నిర్బంధాన్ని ఆపాలని డిమాండ్ చేసింది. ధరణి అమలులో జరిగిన లోపాలను సరిచేసి పాసు పుస్తకాలు ఇవ్వాలి ధరణిలోని లోపాలను పరిశీలించి ప్రభుత్వం దృష్టికి తేవడానికి క్యాబినెట్ మంత్రివర్గ ఉప సంఘాన్ని వేసింది ఉప సంఘం ఇప్పటివరకు మూడుసార్లు సమా వేశం జరిపి 20 సమస్యలు ఉన్నట్టు గుర్తిస్తూ వాటిని సరిదిద్దడానికి ప్రభుత్వానికి సూచనలు చేసింది తక్షణమే ఆ లోపాలను సవరించాలని సీపీఐ(ఎం) డిమాండ్ చేస్తుంది.రాష్ట్రంలో గత ఐదు రోజులుగా వీఆర్ఏ లు సమ్మె చేస్తున్నారు ఆ సమ్మెను వారి సమస్యలను తక్షణమే పరిష్కరిం చాలని వారు చేస్తున్న పోరాటానికి పార్టీ మద్దతు తెలియజేస్తూ ప్రత్యక్ష ఆందోళనలు చేస్తామని రాష్ట్ర కమిటీ తెలిపింది. కనీస వేతనాలు అమలు చేయాలని షెడ్యూల్ పరిశ్రమలలో కనీస వేతనాల జీవోలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 3న కార్మికులు తలపెట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమానికి సీపీఐ(ఎం) సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని ఈ సందర్భంగా తీర్మానం చేయడం జరిగింది. రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాల వలన నష్టపోయిన రైతులకు లక్ష రూపాయల నష్టపరిహారాన్ని అందించాలని రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. పై సమస్యల మీద రాబోయే కాలంలో ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేయాలని తీర్మానం చేసింది. పార్టీ రాష్ట్ర కార్య దర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌రావు, జిల్లా కన్వీనర్ బొట్ల చక్ర పాణి, జిల్లా కమిటీ సభ్యులు సారంపల్లి వాసుదేవరెడ్డి, రాగుల రమేష్, వాంకుడోత్ వీరన్న, గుమ్మడిరాజుల రాములు, మంద సంపత్, దొగ్గెల తిరుపతి, భానునాయక్, లింగయ్య, మిశ్రీన్ సుల్తానా పాల్గొన్నారు.