Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అయినా రాష్ట్ర సర్కారు ముందుకే
- 1990లో 40 మండలాలు గుర్తిస్తే..
- సగం మండలాలకు చేరని సాగు
- మార్కెట్ సౌకర్యలేమితో ఆ రైతుల ఇక్కట్లు
- గత అనుభవాలను పట్టించుకోని సర్కారు
- తాజాగా 2 లక్షల ఎకరాల సాగు లక్ష్యం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఆయిల్‌పామ్ సాగు పలు అనుమానాలను రెేకెత్తిస్తున్నది. ఎంతో వ్యయాప్రసయాలకు లోనై సాగు చేసే ఈ పంటను గుండుగుత్తగా సాగు చేయడం అంత శ్రేయస్కరం కాదని తేలింది. ఇప్పటికే రాష్ట్ర రైతాంగానికి దీనిపై ఎన్నో అనుభావాలున్నాయి. వాటిని పరిగణనలోకి తీసుకోకుండానే రాష్ట్ర ప్రభుత్వం ఆఘమేఘాల మీద సాగును ప్రోత్సహిస్తున్నది. ఆయిల్‌పామ్ సాగు విషయంలో ఎంతో మంది నిపుణులు ఉన్నప్పటికీ వారి అభిప్రాయాలను తీసుకోకుండానే ముందుకు సాగుతున్నది. ముఖ్యంగా విత్తనాలు అందుబాటులో లేకున్నా...థాయిలాండ్, కోస్టారికా, మలేషియా దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నది. ఈ క్రమంలో మొలకెత్తిన మొలకలను తీసుకొచ్చి నాటేందుకు సిద్ధమవుతున్నారు. సుమారు ఒక మొలకకు రూ 50 లేదా రూ 60 ఖర్చవుతున్నది. రవాణాతో కలిపి రూ 193 అవుతున్నది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు చేసేందుకు లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే 15520 ఎకరాల్లో పూర్తి చేసింది. 11 కంపెనీలకు 27 జిల్లాల్లో భూములను కేటాయించింది. రాష్ట్ర సర్కారు లక్ష్యానికి అనుగుణంగా రైతులు ముందుకు రావడం లేదు. దాదాపు ఆరేండ్లు పంట ఫలితాల కోసం ఎదురు చూడాల్సి వస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. అంతర పంటలకు సబ్సిడీ ఇస్తున్నా...రైతులకు దీనిపై నమ్మకం కుదరడం లేదు. చిన్న,సన్నకారు రైతులు ముందుకు రావడం లేదు. ఈక్రమంలో పెద్ద భూస్వాములు, ఎన్ఆర్ఐ, పరిశ్రామికవేత్తలకు, పెట్టుబడికి కొదవలేని వారికే ఇది ఉపయోగకరమని వినపడుతున్నది. అటువంటి ఇప్పుడు వారే ముందుకు వస్తున్నారు. ఆయిల్‌పామ్ సాగు కోసం ఎకరాకు మొలకలకు రూ 190 శాతం, ఎరువుల సబ్సిడీ రూ 2100, సూక్ష్మసేద్యానికి సబ్సిడీలు ఎస్సీ,ఎస్టీలకు వంద శాతం, ఇతరులకు 90శాతం, 80శాతం ఇస్తున్నది.
గత అనుభావాలేంటి?
ఉమ్మడి రాష్ట్రంలో 1993 ఆయిల్‌పామ్ సాగు ప్రారంభమైంది. అప్పట్లో ఖమ్మం జిల్లాలోని 40 మండలాల్లో వంద ఎకరాల్లో సాగు చేయాలని నిర్ణయించింది. దాదాపు 100 ఎకరాలను ఇందుకోసం కేటాయించింది. అయితే 30 ఏండ్లలో సగం కూడా సాగులోకి రాలే. 2009 నల్లగొండ జిల్లాల్లోనూ అదే పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టులు ద్వారా నీరు పుష్కలంగా ఉంది. కాబట్టి అత్యధికంగా నీరు లభ్యత ఉన్నది కాబట్టి పంట వేయాలని చెబుతున్నది. నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు కింద నీరు అందుతున్న నల్లగొండలో ఆయిల్‌పామ్ సాగవుతున్నది. దీంతోపాటు ఐదారేండ్లు పంట కోసం ఎదురుచూడటం, అంతర పంటలతో జీవనగడకపోవడం, ఒకవేళ పంట విఫలమైతే పరిస్థితి ఏంటి? అనే అనుమానాలు వస్తున్నాయి. ఏ నేలలో ఏ పంట పడుతుందో దాన్ని అంచనా వేయకపోవడం కూడా విముఖతకు కారణమవుతున్నది. రంగారెడ్డి జిల్లా ద్రాక్ష, నిజామాబాద్ చెరుకు పంటకు, వనపర్తి, నారాయణ పేటకు వేరుశనగ పంటలకు ప్రసిద్ధి. అయిల్‌పామ్ పంటకు ఏ ప్రాంతమైతే బాగుంటుందో నిర్ధారించకుండా కూడా సర్కారు ముందుకు పోతున్నదే విమర్శ లున్నాయి.
దేశంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. 8లక్షల ఎకరాల్లో సాగు చేయాలని నిర్ణయించ గా... నాలుగు లక్షల ఎకరాలకు కూడా చేరుకోలేదు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో 75శాతం పంటలను తొలగించారు. నేలల స్వభావం, వాతావరణ సమస్యలు, ప్రభుత్వ సహకారంతోపాటు ఇతర సమస్యలతో సాగు ఆగిపోతున్నది. దీంతోపాటు ప్రభుత్వ రంగ సంస్థలను కాదనీ, అనుభవం లేదని ప్రయి వేటు సంస్థలకు అప్పగించడం మరింత ప్రమాదకరమనే వాదన వినిపిస్తున్నది.
విశ్లేషించాలి...: కేవీ రంగారెడ్డి, రిటైర్ సీనియర్ మేనేజర్ ఆయిల్‌పామ్ సంస్థ
అయిల్‌పామ్ సాగు చేసేందుకు పూర్తిగా విశ్లేషణ చేయాలి. రైతులకు అవగాహన కల్పిం చాలి. వారిని చైతన్యపరచాలి. నిపుణులు, అధికారులు, రిటైర్డ్ అధికారులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించాలి. సాధకబాధకాలను తెలుసుకోవాలి. గత అనుభావాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోవాలి. దేశానికి, రాష్ట్రానికి ఆయిల్‌పామ్ సాగు అత్యవసరం.
మార్కెట్ గ్యారంటీ చేయాలి
టి సాగర్, ప్రధాన కార్యదర్శి తెలంగాణ రైతుసంఘం
ఆయిల్‌పామ్ సాగు రైతులకు మార్కెట్ గ్యారంటీ చేయాలి. సబ్సిడీని సకాలంలో చెల్లించాలి. వీటిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రకటనలు చేసి, ప్రోత్సహించాలి. నేలలు, వాతావరణం అనుకూలంగా ఉన్న పొలాల్లో పండించవచ్చు. ఈ పంటను పండించడం దేశానికి అవసరం. ఇప్పటికే మన దేశం ఆయిల్‌ను దిగుమతి చేసుకుంటున్నది. ఈ పరిస్థితి మారాలి. అప్పుడే దేశ ఆర్థికాభివృద్ధికి ఇది తోడ్పడుతుంది.