Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ ఉత్తర్వులు జారీ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
స్వతంత్ర భారత వజ్రోత్సవాల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం కమిటీని నియమించింది. ఆగస్టు ఎనిమిది నుంచి 22 వరకు ఉత్సవాలు నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ 24 మందితో కూడిన కమిటీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీలో రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె.కేశవరావు చైర్మెన్‌గా, సాధారణ పరిపాలనా శాఖ కార్యదర్శి కన్వీనర్‌గా, ముఖ్యమంత్రి ప్రత్యేకాధికారి దేశపతి శ్రీనివాస్ ప్రత్యేక ఆహ్వానితులుగా ఉన్నారు. ఈ కమిటీ ఉత్సవాలకు అవసరమైన సాంస్కృతిక, సాహిత్య, ఇతర కార్యక్రమాలను రూపొందించనున్నది.
కమిటీ తొలి సమావేశం
ఇదిలా ఉండగా కమిటీ తొలి సమావేశం బుధవారం హైదరాబాద్ బీఆర్ కెఆర్ భవన్లో జరిగింది. ఈ సమావేశంలో రాజధాని నగరంతో పాటు జిల్లా కేంద్రాలన్నింటిలో ఘనంగా ఉత్సవాలు నిర్వహించాలని నిర్ణయించారు. తొలి రోజు ఆగస్టు ఎనిమిదిన హైటెక్స్‌లో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించాలనీ, ఆగస్టు 22న నగరంలోని నెక్లెస్ రోడ్లో పెద్ద ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించాలని తీర్మానించారు. అమృత్ మహౌత్సవ్ ఉత్సవాల ప్రాముఖ్యతపై పాఠశాల విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాస పోటీలు నిర్వహించాలనీ, ఫిలిం పెస్టివల్ వంటి కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. ఈ సమావేశాల్లో న్యూఢిల్లీ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.