Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఈవో వికాస్‌రాజ్‌కు నిరంజన్ లేఖ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఓట్ల రద్దు అంశంపై వెంటనే అఖిలపక్షాన్ని నిర్వహించాలని టీపీసీసీ ఉపాధ్యక్షులు జి నిరంజన్ డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ల జాబితా నుంచి ఒకే రకమైన ఫోటోలు ఉన్న 10,25,987 ఓట్లను ఏ ప్రాతిపదికన తొలగించారంటూ ప్రశ్నించారు. ఈమేరకు బుధవారం సీఈవోకు ఆయన లేఖ రాశారు. చట్ట విరుద్ధంగా ఓట్లను తొలగించడం సరికాదని పేర్కొన్నారు.